Sep 23,2023 17:10

ప్రజాశక్తి-కారంచేడు : మండలంలోని జరుబులవారిపాలెం గ్రామ శివారులో ఇంకొల్లుకి చెందిన ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన బస్సు పంట కాలవలోకి దూసుకొని పోయి పలువురు విద్యార్థులక స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు చెప్పిన వివరాలు ప్రకారం ఇంకొల్లులోని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన బస్సు ప్రతిరోజు ఉదయం పూసపాడు నుంచి బయలుదేరి  తిమిడిత పాడు, కేశవరపాడు, జరుబుల వారి పాలెం మీదుగా ఇంకొల్లుకు చేరుతుంది. అయితే శనివారం పరిమితికి మించిన విద్యార్థులు ఆ బస్సులో ఉండటం వలన అదనపులోడు ఎక్కువ అవ్వటం వల్ల ఈ బస్సు అద్భుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయిందని చెప్తున్నారు.

  •  గేదెను తప్పించబోయి ప్రమాదం జరిగింది : కారంచేడు ఎస్ఐ జి శ్రీనివాసరావు 

 దీనిపై కారంచేడు ఎస్ఐ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ జరుబుల వారి పాలెం వద్ద రోడ్డుపై గేదె అడ్డంగా రావడంతో గేదెను తప్పించబోయి బస్సు వంటకాలలోకి పోయిందని చెప్పారు .బస్సులో ఉన్న విద్యార్థులు ఎవరికి ప్రాణాపాయం లేదని అంతా సురక్షితంగానే ఉన్నారని ఎస్ఐ తెలిపారు.