Feb 23,2023 15:52

ప్రజాశక్తి- పిచ్చాటూరు : తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని బీమల చెరువు పంచాయతీ రైతు భరోసా కేంద్రాన్ని గురువారము మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ త్రివేది అకస్మాత్తుగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో గ్రామములోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అందులో భాగంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాన్ని స్థాపించింది. ఈ రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారులు రైతుకు కావలసిన సబ్సిడీ విత్తనాలు ఎరువులు మందులు అందుబాటు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా లబ్ధి పొందే విధంగా అధికారులు స్పందించాలని లేనియెడల రైతు నష్టపోయే పరిస్థితి వస్తుందని కావున అలాంటి పరిస్థితులు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా తప్పక రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులు రైతులకి సంబంధించిన పంట నమోదు కార్యక్రమం ఆన్లైన్లో నమోదు చేసి రైతులు కోరిక మేరకు విత్తనాలు ఎరువులు మందులు ఆర్డర్లో తీసుకొని పై అధికారులకు ఆన్లైన్లో నమోదు చేసి అవి అన్ని కూడా రైతు భరోసా కేంద్రంలో సరుకులు ఉండేలాగా ప్రణాళికలు చేసుకోవాలని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి మేలు చేసిన వారం అవుతామని అధికారులకి తెలిపారు. రైతులు పండించిన పంటలను ప్రతి పంటకు ఇన్సూరెన్స్ నమోదు చేయాలని అప్పుడే ప్రకృతి అనావృష్టి వచ్చిన అలాంటి రైతులను ప్రభుత్వం పంట నష్టానికి రుణము కల్పిస్తుందని గ్రామాల్లో రైతులు కి మెరుగైన సేవల కోసం రైతు భరోసా లో పనిచేస్తున్న రైతు సహాయకులు ఎల్లప్పుడూ రైతు పక్షాన నిలబడాలని వారిని ఆదేశించారు.