Jul 25,2021 19:46

న్యూఢిల్లీ :  పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ , డీజిల్‌ లీటర్‌ ధర రూ. 100ను దాటి పరుగులు పెడుతోంది. గత ఆరేళ్లలో పెట్రోల్‌పై కేంద్రం విధించే పన్ను రెట్టింపైందని, ఇది  పెట్రోల్‌పై 88 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే  డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం మూడు రెట్లు పెరిగి 209 శాతానికి చేరిందని  ప్రభుత్వ నివేదిక తెలిపింది. 2021, జులై 1న పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం సెస్‌తో కలిపి లీటరుకు రూ. 32.90 కాగా, 2015 జులై1న రూ. 17.46గా ఉన్నట్లు అధికారిక సమాచారం తెలిపింది. అంటే పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం రెట్టింపై 88 శాతానికి పెరిగింది. అదే విధంగా డీజిల్‌పై ఎక్సైజ్‌ సుకం సెస్‌తో కలిపి 2015 జులైలో రూ.10.26 కాగా, ఈ ఏడాది జులైలో రూ. 31.80కి చేరింది.