May 21,2023 16:13
  •  ప్రతిరోజు "లో వోల్టేజ్ తో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి
  •  ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురవడంతో  గురవడంతో ఆదివారం అంతా విద్యుత్ సరఫరా నిలిపివేత 

ప్రజాశక్తి-కోట : మొదలే వేసవికాలం ఎండలు అత్యధికంగా ఉన్న పరిస్థితుల్లో ""లో వోల్టేజ్ తో ప్రతిరోజు అటు గృహాలలో పనులు జరగక,ఇటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్క పోతతో నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు.ఒకరోజు రెండు రోజులు కాదు గత నెలలు నుండి "లో వోల్టేజ్ తో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రతిరోజు విసిగిపోతున్నారు. కోట మండలంలోని విద్యానగర్ కొత్తపాలెం రోడ్డు సమీపంలో ఒకే ఒక వీధిలో నివసిస్తున్న పలు కుటుంబాలకు విద్యుత్ సరఫరా అందించే ట్రాన్స్ఫారమ్ "లో వోల్టేజ్ సమస్య ఉందని విద్యుత్ శాఖ అధికారులు పదేపదే చెప్తున్నారే తప్పా,ఆయా విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నారని స్థానిక నివాసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో పలుసార్లు విద్యుత్ సమస్య వస్తూ ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు పలుమార్లు మైనర్ తాత్కాలిక మరమ్మతులు చేస్తూ ఉంటున్నారు. అందులో ఈరోజు ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవడంతో గృహంలో నిత్య అవసరాలు సమ కూర్చుకోవడానికి విద్యుత్ లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి శాశ్వతంగా విద్యుత్ సమస్య లేకుండా మరొక ట్రాన్స్ఫారంను అమర్చాలని ఆ సమీపంలో ఉండే పలు కుటుంబాలు కోరుతున్నారు. అనంతరం ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి డిఈ ఇస్మాయిల్ ను వివరణ అడగగా త్వరలోనే "లో వోల్టేజ్ సమస్య"లేకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.