ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పోటుగారి భాస్కర్ ను నియమించారు. వెదురుకుప్పం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందుకూరి హుమేష్ హర్షం వ్యక్తం చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న పోటుగారి భాస్కర్ ను కాంగ్రెస్ పెద్దలు గుర్తించి జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగించినందుకు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకి, మాజీ కేంద్ర మంత్రివర్యులు డా. చింతమోహన్ కి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ కి, జిల్లాలోని సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పోటుగారి భాస్కర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అశాభావం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో మండల కాంగ్రెస్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, మొండివెంగనపల్లి సర్పంచ్ పోటుగారి లలితాభాస్కర్, జయచంద్ర, మునికృష్ణారెడ్డి,దావుద్ భాషా, కిషోర్,ధనశేఖర్, సులోచనమ్మ, కందుకూరి జ్యోతినాధ్, పవిత్ర,పద్మనాభ రెడ్డి, యువరాజు తదితరులు వున్నారు.










