Mar 25,2023 16:27

ప్రజాశక్తి -కోట : చిరుధాన్యాలు అనునిత్యం తీసుకోవడం వలన గర్భవతులు,బాలింతలు శారీరక బలాన్ని కలిగిఉంటారని ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్ వైజర్ కవిత అన్నారు.ఈ సందర్బంగా శనివారం పోషణ పక్వాడా కార్యక్రమాలలో భాగంగా కేశవరం అంగన్వాడీ కేంద్రం నందు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలు మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వలన శక్తి ఎక్కువగా లభిస్తుందని తెలియజేయడం జరిగింది.అందులోభాగంగా గర్భిణీలు మంచి పౌష్ఠికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తారు అని తెలియజేయడం జరిగింది.ఈకార్యక్రమంలో  మహిళా పోలీసు షర్మిల,ఎమ్ ఎల్ హెచ్ పి ప్రసన్న,స్కూల్ టీచర్ లు,అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకురాలు తల్లులు పాల్గొనడం జరిగింది.