ప్రజాశక్తి - కశింకోట : కశింకోట సెయింట్ జాన్స్ స్కూల్ లో బుధవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బత్తుల నోబొల్ కుమార్, కరస్పాండెంట్ బత్తుల అనురాధ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించాలి అని అన్నారు. ఒకరికొకరు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని తెలిపారు. ముందుగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల ముగ్గులు వేశారు గొబ్బెమ్మలు ముగ్గులు పై వేసారు సహ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.










