Dec 02,2022 15:14

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వ వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు.మన్యములో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి జడ్డంగి ఎస్ఐలు టీజీ నరేంద్ర ప్రసాద్, షరీఫ్ లు, పోలీస్ సిబ్బంది, ఏపీఎస్పీ బెటాలియన్ శుక్రవారం లోతట్టు ప్రాంతాలను జల్లేడు పట్టారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసారు. అనుమానితులు, కొత్తవ్యత్తుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పోలీసులు అనుమతి లేకుండా అనవసరంగా లోతట్టు గ్రామాల్లో పర్యటించకూడదని సూచించారు. జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.