Sep 24,2023 16:02

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్  : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చలో విజయవాడ. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వెళుతున్న సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ అంగన్వాడి పుత్తూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు యు విజయ కుమారి అరెస్ట్ చేసి పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు గతంలో అనేకసార్లు మా డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. తెలంగాణ కన్నా అదనంగా జీతాలు పెంచుతామని ఎన్నికల సందర్భంగా పాదయాత్రల హామీ ఇచ్చారని అదేవిధంగా వారి సమస్యలను అంతా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చి  ఇప్పుడు నాలుగున్నర ఏండ్లు నడుస్తున్న కాలయాపన చేస్తున్నారన్నారు. అరెస్టులతో, లాఠీలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇదేలాగా ప్రవర్తిస్తే ఇంటికి పంపడం జరిగిందని అదేవిధంగా మీకు కూడా గుణపాఠం చెప్తామన్నారు.