Apr 19,2023 13:02
  • ఐదేళ్ల తర్వాత ఒకటైనందుకు   సంతోషంగా ఉంది 
  • ఎస్సై గిరిధర్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలియజేసిన భార్యాభర్తలు

ప్రజాశక్తి-తిరుపతి : ఐదు సంవత్సరాల ముందు విడిపోయిన భార్యాభర్తలను ఆర్ సి పురం పోలీసులు కలిపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆర్ సి పురం ఎస్సై  గిరిజరెడ్డి  ఇచ్చిన వివరాలు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం కుప్పం బాదూర్ పంచాయతీ ఒడ్డికాలువ గ్రామానికి చెందిన సుమిత్రాకు తిరుపతి బైరాగి పట్టెడ  చెందిన గణేష్ తో వివాహమైంది. కొంతకాలం సంసారం సజావుగా సాగింది. కొన్ని మనస్పర్ధల కారణాలతో భార్యాభర్తలు విడిపోయారు. భార్యాభర్తల విడిపోయి  ఐదు సంవత్సరాలు కావస్తున్నది వారిద్దరిని  కలిపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆర్సిపురం ఎస్ఐ ఎస్ గిరిధర్ రెడ్డికి సుమిత్ర మా భార్యాభర్తలను కలిపి సంసారాన్ని చక్కదిద్దాలని  విజ్ఞప్తి చేయగా  ఎస్సై గిరిధర్ రెడ్డి స్పందించి బైరాగి పట్టెడకు చెందిన సుమిత్ర భర్త గణేష్ ను పోలీస్ స్టేషన్కు పిలిపించి భార్యాభర్తలకు ఇద్దరికీ  కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో మనస్పర్ధలను పక్కనపెట్టి ఒకరు ఒకరు అర్థం చేసుకుని ఒకటై  సంసారం సాగించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఆ భార్యాభర్తలు  ఎస్ఐ గిరిధర్ రెడ్డి. పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.