Oct 13,2023 16:32
  • 130 లీటర్ల నాటు సారా, 328మద్యం బాటిల్స్.

ప్రజాశక్తి - ఆలమూరు : స్థానిక ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న నాటు సారా, మద్యం బాటిల్స్ ను స్థానిక ఎస్ఈబి స్టేషన్ ఆవరణలో రూ. లక్ష 30వేల విలువ గల వీటిని శుక్రవారం ధ్వంసం చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పి ఖాదర్ బాషా ఆదేశాల మేరకు అమలాపురం అసిస్టెంట్ ఎన్పోర్స్మెంట్ సూపర్టడెంట్ ఎం.శ్రీనివాసరావు, ఆలమూరు ఎస్ఈబీ ఎస్సై పి.రాంబాబు ల ఆధ్వర్యంలో ఈ ఏడాది మే, జూన్, జూలై మూడు నెలల కాలంలో పట్టుకున్న వివిధ కేసులలో సీజ్ చేసిన నాటు సారా, మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  25 కేసుల్లో రూ 32,400ల విలువ గల 130 లీటర్ల నాటు సారా, రూ.99,000ల విలువ గల ఏపీకి చెందిన డిపిఎల్ రెండు కేసులలో 22 బాటిల్స్, ఎన్డిపిఎల్ 26 కేసులలో 172 లీటర్లు (328 బాటిల్స్)ను ఆలమూరు వీఆర్వోలు ప్రసాద్, వెంకట్ ల సమక్షంలో ధ్వంసం చేసినట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అధికారులు పాల్గొన్నారు.