
ప్రజాశక్తి-ఏలూరు జిల్లా : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏలూరు నగరంలోని పోలీస్ మైదానంలో అమరవీరులకు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పోలీసు అధికారులు, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల ఆట కట్టించేందుకు మీరు చేసిన త్యాగాలు మరువలేనివి, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో విధినిర్వహణలో అసువులు బాసిన అమరులైన అమరవీరులకు ఘన నివాళులని పేర్కొన్నారు. .