ప్రజాశక్తి-విఆర్ పురం : పోలవరం పోరుకేక మహా పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా సభ్యులు పూనం సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు శనివారం రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిపాక నుండి విజయవాడ వరకు 15 రోజుల పాటు సిపిఎం చేపట్టిన మహా పాదయాత్రలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బంకు సత్తిబాబు, పులి సంతోష్ కుమార్, సోడి మల్లయ్య, తాతబాబు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










