Aug 22,2023 23:19
జనరల్‌ సెక్రటరీ సురేష్‌కు నోటీసు అందజేస్తున్న పోలీసు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఈ నెల 23న విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన ధర్నాకు వెళ్లవద్దని పోలీసులు మంగళ వారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘాల సమాఖ్య ఫ్యాప్టో నాయకులకు నోటీసులు అందజేశారు. బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పోలీసులు ఇంటికి వచ్చి రేపటి విజయవాడ ఫ్యాప్టో ధర్నాకు వెళ్లవద్దని నోటీసు ఇచ్చినట్లు ఫ్యాప్టో ఛైర్మన్‌ బడుగు శ్రీనివాస్‌, జనరల్‌ సెక్రటరీ సిహెచ్‌ సురేష్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్త ధర్నాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము ధర్నా చేసుకుంటుంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.