ఫ్యాప్టో కార్యచరణ విజయవంతం చేయండి : ఎస్‌టియు
ప్రజాశక్తి - చాగలమర్రి
ఫ్యాప్టో కార్యచరణను విజయవంతం చేయాలని ఎస్‌టియు రాష్ట్ర కౌన్సిలర్లు శివశంకర్, ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి సుబ్బారావులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద కార్యాచరణ కరపత్రాలను విడుదల చేసారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ 2019 ఎన్నిక లకు ముందు అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపు సిపిఎస్ రద్దు చేస్తామని,సకాలంలో డిఏలు,మెరుగైన పిఆర్‌సి ఇచ్చి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి 4 సంవ త్సరాలైన ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామి నెరవేర్చలే దన్నారు. పాఠశాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న జిఓఎంఎస్ నెం 117 ను రద్దు చేయాలని,బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులను మినహా యించాలని,పిఆర్‌సి,ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జూన్ 1 నుండి వివిధ స్థాయిలో కార్యాచరణ ద్వారా సెప్టెంబరు 1 వరకు వివిధ రకాల నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌టియు సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, శేషాద్రి, నరసింహులు, రాజశేఖర్ రెడ్డి, సురేషప్ప, మహబూబ్ బాషా, వై శ్రీనివాసులు, మస్తాన్ భాష, సుజీవ్, నిరంజన్ మహబూబ్ హుసేన్, సుబ్బారెడ్డి, ఎన్ ప్రసాద్, గౌస్ అహమ్మద్, ఇబ్రహీం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.










