Apr 07,2023 00:07

లాంఛనంగా ప్రారంభించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం
ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంతో ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుందని పలువురు నాయకులు తెలిపారు. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు.కె.కోటపాడు:ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి ఇంటి వద్దనే నిత్యం ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటు ందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. మండలంలోని గుల్లేపల్లి గ్రామంలో రూ.17.50 లక్షలతో నిర్మించిన విలేజ్‌ వెల్నెస్‌ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి డాక్టర్‌ అందుబాటులో ఉండే విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి మాట్లాడుతూ మండలానికి రెండు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఇద్దరు డాక్టర్లతో పాటు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్‌ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఈర్లె అనురాధ, ఎంపిపి రెడ్డి జగన్మోహన్‌, అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి జ్యోతి, వైద్యాధికారులు, పాల్గొన్నారు.
కశింకోట : ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. మండలంలోని జె.తునిలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి సచివాలయాన్ని డాక్టర్లు సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హేమంత్‌, ఎంపిపి కలగా లక్ష్మి, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు, వైస్‌ ఎంపిపి నమ్మి మీణా, సర్పంచ్‌లు కలగా గున్నయనాయుడు, కొన అరుణ, కొన నాగేశ్వరరావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వడ్డాది : ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ అన్నారు. వడ్డాదిలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండా రాంబాబు, వైద్యులు సిహెచ్‌.శకుంతల, ఆర్‌.మౌనిక, వైసీపీ నేతలు దొండా నారాయణమూర్తి, కోరుకొండ సూరప్పారావు, ఉప సర్పంచ్‌ దాడి సూర్య నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని వెన్నలపాలెం సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెన్నెల అప్పారావు, ఎంపీటీసీ వెన్నెల అరుణ కుమారి, ఉప సర్పంచ్‌ వెన్నెల సన్యాసిరావు, పరవాడ సర్పంచ్‌ సిరిపురపు అప్పలనాయుడు, ఉప సర్పంచ్‌ బండారు రామారావు, ఆర్‌ఇసిఎస్‌ మాజీ చైర్మన్‌ చల్ల కనకారావు, పిహెచ్‌సి డాక్టర్‌ రంజిత్‌, ఇఒఆర్డీ పద్మజ, వైసిపి నాయకులు పైల సత్యనారాయణ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన కుటుంబ వైద్యులు కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు చెప్పారు. మండలంలోని కొండకర్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ యు సుకుమార్‌ వర్మ, కోన లచ్చన్‌నాయుడు పాల్గొన్నారు.
నక్కపల్లి:సిఎం జగన్‌ ఫ్యామిలి డాక్టర్‌ పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు గాను నక్కపల్లిలో వైసీపీ కార్యాలయం వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జడ్పిటిసి కాసులమ్మ, సీనియర్‌ నాయకులు మణిరాజు తదితరులు మాట్లాడుతూ, ఎంపిపి ఏనుగుపల్లి రత్నం, నేతలపై బుధవారం జరిగిన దాడి ఘటన దుర దృష్టకరమన్నారు. మండలంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయ మన్నారు. ఇక నుంచి ఐకమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. వీసం రామకృష్ణ మాట్లాడుతూ, తన కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకి జీవితాంతం అండగా నిలుస్తామన్నారు. ఎంపిపి రత్నం మాట్లాడుతూ, దళిత మహిళా అని చూడకుండా కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని, అండగా నిలిచిన వారందరికీ రుణ పడి ఉంటానని కన్నీటి పర్వతంమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లు జయ రత్నకుమారి, సాదిరెడ్డి శ్రీనివాస్‌, సురేష్‌ వర్మ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు వీసం నానాజీ, భార్గవ్‌, గంటా తిరుపతిరావు, కొప్పిశెట్టి హరి, కొల్లాటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల:మండలంలో రామచంద్రపాలెం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వెంకటాపురం పిహెచ్సి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్‌ పరదేశమ్మ, ఎంపీటీసీ సభ్యులు రాంబాబు ప్రారంభించారు. గ్రామాల్లో పేద ప్రజలకు ఇకపై ఫ్యామిలీ డాక్టర్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సందీప్‌, పత్యూష, గ్రామీణ ఆరోగ్య విస్తరణ అధికారి గోవిందరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:మండలంలో రేవు పోలవరం గ్రామం లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ, గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేదని, ప్రస్తుతం మన ఊరిలోనే మన ఇంటి వద్దేకే ఉచిత వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ రామచంద్రమూర్తి, మండల వైస్‌ ప్రెసిడెంట్‌ అప్పన్న, గ్రామ సర్పంచ్‌ లోవరాజు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం మండలం వేములవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం మండలంలో ఉన్న పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి ఎమ్మెల్యే ముత్తంశెట్టి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా డిఎంహెచ్‌ఒ జగదీశ్వరరావు, స్థానిక వైద్యాధికారి కోరాడ శైలజ, ఎంపిడిఒ లవరాజు, తహశీల్దార్‌ రామారావు, నాయకులు బంక సత్యనారాయణ, గన్‌రెడ్డి శ్రీనివాసరావు, బిఆర్‌బి నాయుడు, బోని ఆప్పలనాయుడు, పినిశెట్టి సింహాచలంనాయుడు, పాండ్రంగి శ్రీను, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు
పద్మనాభం : మండలంలోని కోవ్వాడలో పిహెచ్‌సి ఆధ్వర్యాన కార్యక్రమాన్ని వైద్యాధికారి కె.స్వప్న ప్రారంభించారు. ఈ కార్యక్రమములో వైద్య సిబ్బంది రాము, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి : మండలంలోని గోరపల్లిలో ఫ్యామిలీడాక్టర్‌, 104 నూతన వాహనాన్ని ఎమ్మెల్యే అదీప్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొరపల్లి సర్పంచ్‌ గొరపల్లి శ్రీను, ఎమ్‌పిపి.నాగమణి, జెడ్‌పిటిసి సభ్యులు ఉప్పిలి దేవి, వైస్‌ ఎంపిపి చిరికి దేముడు, వైద్యాధికారులు డాక్టర్‌ పూర్ణేశబాబు, జీవనారాణి, జగదీష్‌ ప్రసాద్‌, పద్మావతి పాల్గొన్నారు.