
ప్రజాశక్తి - గణపవరం
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి.సంతోష్‌నాయుడు అన్నారు. మండలంలోని అర్థవరంలో శనివారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. బిసి, షుగర్ ఉన్నవారికి మందులు అందించారు. సిహెచ్‌ఒ విల్సన్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో 35 ఏళ్లు దాటిన వారందరూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాని వినియోగించుకుని వైద్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పిలు దివ్యభారతి, ఎఎన్‌ఎం లక్ష్మీకాంతం, హెల్త్ అసిస్టెంట్ బి.రవికుమార్, 104 సిబ్బంది బి.శ్రీనివాస్, ఎ.రవి పాల్గొన్నారు.