ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్:విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఈ నెల 22, 23 తేదీలలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి ఫవర్ లిప్టింగ్ చాంపియన్ షిఫ్ -2023 పోటీలలో కెఎల్‌యు విద్యార్ధులు అత్యంత ప్రతిభ కనబర్చారని కెఎల్ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంక్షేమ విభాగ అధిపతి డాక్టర్ చప్పిడి హనుమంతరావు బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో బి ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బిట్టు కుమార్, బిఎస్‌సి వ్యవసాయం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్.వి.అశ్వినిలు మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం కైవసం చేసుకోగా, బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున చందన్ కుమార్, ట్రిపుల్ ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చంద్రశేఖర్, ఫార్మాడి మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.కౌబారులు ద్వితీయ స్థానాలలో నిలిచి రజత పథకాలను సాదించారని అన్నారు. క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచే విద్యార్ధులకు ఫీజుల రాయితీలను కూడా కల్పిస్తున్నామన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్ చాన్సులర్ డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, క్రీడల అసోసియేట్ డీన్ డాక్టర్ కె.హరికిషోర్, డాక్టర్ కె.సుజాత, వ్యాయామ అద్యాపకులు విద్యార్ధులను అభినందించారు.










