Sep 27,2023 23:19

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్‌ కళాశాల సహకారంతో ఫుట్‌బాల్‌ అండర్‌-19 బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికను మండలంలోని నందిగామ జెడ్‌పి పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్లు వై.ఉదయభాస్కర్‌ ఎస్‌.సుధాకర్‌రెడ్డి, ప్రగతి జూనియర్‌ కళాశాల గంపా శ్రీను, ఫిజికల్‌ డైరక్టర్‌లు నరసింహారావు, పి.శివరామకృష్ణ పర్యవేక్షించారు. ఎంపికైనవారు అక్టోబర్‌ మొదటి వారంలో చిత్తూరు జిల్లాలో జరిగే 67వ ఆంధ్రప్రదేశ్‌ అంతరజిల్లాల పోటీల్లో పాల్గొంటారని గుంటూరు జిల్లా అండర్‌-19 జాయింట్‌ సెక్రటరీ వై.ఉదయభాస్కర్‌ తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎల్‌.పిచ్చయ్య, బి.అనీల్‌ దత్తానాయక్‌, కె.కిరణ్‌, ఎన్‌.సురేష్‌, షేక్‌ కరిముల్లా, ఎం.నరసింహారావు, పి.వెంకటేశ్వరరావు, ప్రగతి కళాశాల డైరెక్టర్‌ పి.నరేష్‌, వందా కళాశాల డైరెక్టర్‌ అనూషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా బాలుర జట్టు : షేక్‌ మస్తాన్‌వలి, సయ్యద్‌ ఖాజాపీరా, ఎ.గోపీ సందీప్‌, ఎస్‌.శ్రీకాంత్‌, కె.నాగరాజు, జి.కౌషిక్‌, బి.మోషే, ఎం.ముఖేష్‌, షేక్‌ నాగనజీర్‌, పి.నరసింహా, ఎస్‌.మణికంఠ శ్రీనివాసరెడ్డి, బి.హనుమంత నాయక్‌, వి.విజరు, సయ్యద్‌.రవూఫ్‌, షేక్‌ నాగూర్‌ షరీఫ్‌, జె.మోషే, బి.రవీంద్ర, పి.చంద్రశేఖర్‌. స్టాండ్‌ బై... పి.వెంకటేష్‌, ఐ.రవీంద్ర, బి.చరణ్‌, జె.మోషేరాజు, ఆర్‌.అమరనాథ్‌
జిల్లా బాలికల జట్టు : ఎం.జ్యోతి, పి.భూమిక, సి.హెచ్‌.అర్చన, పి.సాయి వెంకట హరిప్రియ, జె.శ్రీవల్లి, జి.సౌజన్య, ఎం.పవిత్రపావని, టి.రజని, ఎన్‌.రమ్య, కె.రమ్య, పి.రమ్యశ్రీ, కె.నేహా, కె.దుర్గా కోమలి, కె.సాయిరూప, కె.హేమారాజేశ్వరి, పి.విష్ణుప్రియ, డి.ప్రవల్లిక, టి.రమాదేవి. స్టాండ్‌ బై... టి.నౌమిక, కె.సుమిత్ర, కె.నీలిమ, కె.మమిత, సి.హెచ్‌. రూపశ్రీ.