Sep 24,2023 01:37

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన కళాశాలలో జాతీయ సేవా పథక వ్యవస్థాపక దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై రాధా మాట్లాడుతూ సాంకేతిక కళాశాలలో విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తమ కళాశాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టే వారే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లుగా చేరుతారని అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ను 1969 సెప్టెంబర్ 24న ఏర్పాటు చేశారన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ విమల బేర తెలిపారు.  కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ వివి సత్యనారాయణ, డాక్టర్ సిహెచ్ సోమేశ్వరరావు, కె సౌజన్య పాల్గొన్నారు.