ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
మండలంలోని పావులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై సిఐ వి సూర్యనారాయణ అవగాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులతో మమేకమై పోలీసు వ్యవస్థ సమాజానికి ఏవిధముగా ఉపయేగపడుతుందనేది వివరించారు. ఆడవారిపై జరుగు నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల, బాలికల పట్ల గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆడపిల్లలకు కలిగే అసౌకర్యాలు, ఎదురవుతున్న వివక్షలు, ఏ విధముగా ఎదుర్కోవాలనే అంశాలు వివరించారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే అంశాలు వివరించారు. తల్లదండులు, గురువులతో ఎలా ఉండాలో చెప్పారు. విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ నాయబ్ రసూల్, పావులూరు మహిళా పోలీస్, హెచ్‌ఎం మెరికెనపల్లి సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి పాల్గొన్నారు.










