ప్రజాశక్తి - బాపట్ల
ఫోర్జరీ సంతకాలతో ఘరానా మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కర్లపాలెంకు చెందిన సుద్ధపల్లి రాజ్యలక్ష్మి భర్త సుద్దపల్లి కమలాకర్ బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఫర్యాదు చేశారు. తమ భార్యకు పూర్వీకుల నుండి సంక్రమించిన 16సెంట్లు ఆస్తిని ఇమ్మడిశెట్టి సురేష్ బాబు, ఇమ్మడిశెట్టి సీతారావమ్మ, మంతెన లక్ష్మీపతిరాజు తన భార్యకు చెందిన స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, పోర్జరీ చేసి రూ.100 స్టాంపు పేపర్‌పై వారికి అనుకూలమైన వారి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. విషయమై బాపట్ల సబ్ రిజిస్ట్రార్‌ను సమాచార హక్కు ద్వారా వివరాలు కోరామని తెలిపారు. తమ స్థలంపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు నిర్ధారణ అయిందన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బాపట్లకు చెందిన న్యాయవాది ఇమ్మడిశెట్టి సురేష్ ఈ ఫోర్జరీ ఘరానా మోసానికి సూత్రధారని తెలిపారు. అది గాక తన భార్యను, తనను ఫోన్ ద్వారా బెదిరిస్తూ మానసికంగా హింసకు గురి చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు, తన కుటుంబానికి న్యాయంచేయాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు కమలాకర్ తెలిపారు.










