Jun 23,2023 23:54

కలెక్టర్‌ నుండి సర్టిఫికెట్‌ అందుకుంటున్న పిహెచ్‌సి వైద్యులు

సత్తెనపల్లి రూరల్‌: కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ద్వారా ప్రతిష్టాత్మకమైన జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సూచీ ధ్రువీకరణ సర్టిఫికెట్‌కు సత్తెనపల్లి మండలం ఫణిదం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం ఎంపికైంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ లో తేటి శివశంకర్‌ నుండి సర్టిఫికెట్‌ ను వైద్యాధికారులు శుక్ర వారం అందుకున్నారు. వైద్యులు వైద్య సిబ్బంది సమిష్టి కృషి కి ఇది నిదర్శనమని కలెక్టర్‌ అభినందించారు. నరసరావు పేటలో జిల్లా కలెక్టర్‌ చేతులమీదుగా సర్టిఫికెట్‌ ఫణిదం పి.హెచ్‌.సి వైద్యాధికారులు ప్రదీప్‌,యు.శ్రీలక్మి కవిత అందు కున్నారు. ఈ పురస్కారం రావడానికి పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.శోభారాణి సూచనలు, తోడ్పా టు అందించడంవల్లనే సాధ్యమైందని అన్నారు.వైద్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.