Jun 01,2023 00:30

ఎస్‌ఐకి వినతి పత్రం అందజేస్తున్న జనసేన పార్టీ నాయకులు

అద్దంకి : విద్వేషాలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కించపరుస్తూ వైసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎస్‌ఐకు, మున్సిపల్‌ కమిషనర్‌కు బుధవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సంద ర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికార వైసిపిఇలాంటి విద్వేషపూరిత ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయడం సమాజంలో అశాంతిని, అభద్రతను రేకెత్తిస్తోం దన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఐటి అధ్యక్షుడు కాలేశ్వరరావు, నాయకులు అచ్చయ్య, సాంబ, శ్రీనివాస్‌ చారి, సుబ్బారావు, అనిల్‌, చిరంజీవి, అనిల్‌,తేజ, మురళి, అశోక్‌,చంద్ర, వీరాంజి పాల్గొన్నారు.