
ఫ్లై ఓవర్ నిెర్మాణ పనుల పరిశీలన
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గత 12 సంవత్సరాలుగా నిలిచిపోయిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 25 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరు చేశారు. ఆ పనులు ప్రారంభమయ్యాయని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను, రాణి పేటలో చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రోడ్ నిర్మాణానికి సంబంధించి నాయుడుకాలపై కల్వర్టర్ల నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉందని ఈ క్రమంలో కల్వర్టర్ల నిర్మాణ పనులు ప్రారం భించారు. విద్యుత్ స్తంభాలను ప్రస్తుతం ఉన్న వాటిని తొలగించి వేరే ప్రాంతంలోకి జరపాల్సి ఉందని ఆ పనులు చేపడుతామని వీలైనంత త్వరగా అర్‌ఓబి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనుబోలు కష్ణయ్య, ముప్పాళ్ల చంద్ర మోహన్ రెడ్డి పాల్గొన్నారు.