ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సమీక్ష
ప్రజాశక్తి - గూడూరు టౌన్ :ఆర్ అండ్ బి ఎలక్ట్రిసిటి అండ్ మున్సిపల్ అధికారులు సమన్వయంతో గూడూరు పట్టణంలో త్వరితగతిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ పేర్కొన్నారు. గూడూరు రెండవ పట్టణంలోకి వెళ్లేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అసంపూర్తిగా గత 12 సంవత్సరాలుగా నిలిచిపోయింది ఇటీవల ముఖ్యమంత్రి పనులు ప్రారంభించడానికి నిధులు మంజూరు చేశారు. ఆక్రమణల తొలగింపు 90 శాతం పూర్తయింది. పనులు ప్రారంభం పై ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్ బి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు అదనపు నిధులు మంజూరు చేశారని ఆక్రమణాల తొలగింపు కూడా పూర్తయిందని అన్నారు. రెండు కట్టడాల వారు కోర్టుకు, వెళ్లారని ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆక్రమణదారులందరూ సహకరిం చాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసే త్వరితగతిన బ్రిడ్జిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈ.ఈ రామాంజనేయులు, ఎలక్ట్రిసిటీ ఈఈ ఇస్మాయిల్ అహ్మద్,పాల్గొన్నారు.










