Mar 11,2023 00:17

సుపర్ణ మృతదేహం

ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని కొమ్మిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మాతె సుపర్ణ (11) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో మాతె సుపర్ణకు ఫిట్స్‌ రావడంతో ఆమె అకస్మాత్తుగా కిందపడిపోయి నురగలు కక్కుకుంటుంది. ఇది గమనించిన పాఠశాల అధికారులు హుటాహుటిన కంఠారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థినిని పరీక్షించిన వైద్యులు సుపర్ణ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతురాలి స్వగ్రామం నాతవరం మండలం, సుందరకోట పంచాయితీ పరిధి తొరడ. శుక్రవారం సాయంత్రం విద్యార్థిని మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పటించినట్టు తెలిసింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.