ఆర్‌టిఒ నాగేంద్రకు వినతి పత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
ఫిట్‌నెస్ లేని బస్సులను నడుపుతున్న ప్రయివేట్, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్‌టిఒ నాగేంద్రకు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల్లో ఫిట్‌నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారని తెలిపారు. బస్సులు సరైన ఫిట్‌నెస్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గౌస్, నాగరాజు, గణేష్, శశి, నరేంద్ర, ఆశిక్ ఉన్నారు.










