
ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేట, బోయపాడు సముద్ర తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి, అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. స్థానిక మత్స్యకార నాయకులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని అధికారులకు చూపించారు. ఇప్పటికే అనేక మంది అధికారులు వచ్చి స్థల పరిశీలన చేసి వెళుతున్నారే తప్ప ఫిష్ లాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయలేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా స్పందించి మత్స్యకారుల జీవన విధానాలను దృష్టిలో పెట్టుకొని ఫిష్ లాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పెద్ద తీనార్ల పంచాయతీ శివారు దొండవాక తీరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబేద్కర్ , ఫిష్ ఇన్చార్జి ఏడి ప్రసాద్, మెరైన్ బోర్డు ఏఈ గోపీనాథ్, మెరైన్ డిఈ వెంకట్రావు, రాజయ్యపేట మత్స్యకార నాయకులు పిక్కి సత్తియ్య, ఎరిపల్లి నాగేష్, పిక్కి గంగరాజు, కొండలరావు, పిక్కి నూకరాజు, కారే వెంకటేష్ బొంది నూకరాజు, పిక్కి రమణ, ఎంపీటీసీ సభ్యులు ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.