Oct 01,2023 00:31

ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి ఒకటో జోన్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న ఉప్పుటేరు ప్రాంతంలో రూ. 28.7 కోట్లతో 6 ఎకరాల విస్తీర్ణంలో పలు సదుపాయాలతో నిర్మించనున్న ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ స్థలాన్ని పరిశీలించారు. ఫిష్‌ డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఆక్షన్‌ హాల్‌, వలల మరమ్మతులకు వీలుగా షెడ్ల నిర్మాణం, 170 బోట్ల యాంకరింగ్‌కు వీలుగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.