ప్రజాశక్తి - పోలాకి : ఫిష్ ఆంధ్ర ద్వారా స్వచ్ఛమైన చేపలను విక్రయిస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మండలంలోని చల్లబంద అడ్డు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర హబ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఫిష్ ఆంధ్ర - ఫిట్ ఆంధ్ర అనే నినాదంతో అందరికీ బలవర్థక ఆహారం అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ యూనిట్ కాస్ట్ రూ.20 లక్షలు కాగా, 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్‌లో టన్ను కెపాసిటీ కలిగిన ఐస్ ప్లాంట్ ఉందన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, నరసన్నపేట ఎంపిపి ఆరంగి మురళీధర్, సర్పంచ్ జి.వెంకటరావు, మత్స్యశాఖ అధికారులు పి.శ్రీనివాసరావు, సంతోష్ కుమార్, బి.సురేష్ కుమార్, గోవిందరావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు నారాయణరావు, గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.










