బడ్డీకొట్టు గచ్చులు పగలకొడుతున్న దృశ్యం
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగులకు బతుకు దెరువు కోసం ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్‌ని కేటాయించింది. దీనిలో భాగంగా పట్టణంలో దళితుడైన కరిసే మధు ప్రభుత్వ పథకమైన ఫిష్ ఆంధ్ర మినీ అవుట్ లెట్ కోసం దరఖాస్తు చేసుకొనగా, ప్రభుత్వం నుండి మంజూరైంది. దీని కోసం అద్దె కట్టలేక చిన్న బడ్డీకొట్టును పట్టణంలోని విద్యానగర్ ఆరో లైన్‌లో గల ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకొన్నాడు. పేటలో ప్రభుత్వ వస్థలాల కబ్జాలకు పాల్పడుతున్న చారుగండ్ల కొండ అనే వ్యక్తి దళితుడునైన తనను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడని అధికారులకు ఫిర్యాదు చేసినా చారుగండ్ల తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని మధు కోరుతున్నారు.










