Jan 09,2023 22:59

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ 

ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే వాటిపై చట్టప్రకారం విచారణ చేసి పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్‌ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. సోమవారం స్పందన పోలీసు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వయంగా ఆయన స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్య తీవ్రత ఆధారంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను బదిలీ చేసి పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
స్పందనలో వచ్చిన ఫిర్యాదులు : గుడ్లవల్లేరు నుండి ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత తన భర్త అదనపు కట్నం కోసం మరొక వివాహం చేసుకొని విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. చల్లపల్లిలో నివాసముంటున్న 80 సంవత్సరాల వద్ధుడు నరసయ్య తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా పంచాడు. అయితే పెద్ద కుమారుడు మతి చెందడంతో కోడలు మనవడు, మనవరాలుతో కలిసి ఉంటూ వద్ధుడి పేర ఉన్న ఆస్తిని మనవడి పేరున రాయాలని, చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. పమిడి ముక్కల నుండి శివ తన సమీప బంధువునికి కుటుంబ అవసరాల నిమిత్తం కొంత సొమ్మును అప్పుగా ఇచ్చాడని, సగం చెల్లించి మిగిలిన సగం చెల్లించకపోగా చంపుతానని బెదిరిస్తున్నాడని న్యాయం చేయాలని కోరాడు. పెడనలో నివాసం ఉంటున్న వివాహిత తన భర్త దుర్వేశనాలకు బానిసై చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, పెద్దలతో చెప్పికున్నపటికి ప్రయోజనం లేదని న్యాయం చేయమని ఫిర్యాదు చేసింది.