ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'జగన్నన్నకు చెబుదాం'లో ప్రజల నుండి అర్జీలను ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిల్లో కుటుంబ, ఆస్థి, ఇతర ఆర్థిక వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. ఫిర్యాదులను పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఎస్సీ ఆదేశించారు. తన వద్ద రూ.29 లక్షలు తీసుకున్న వ్యక్తి వాటిని తిరిగివ్వకుండా బెదిరిస్తున్నారని నరసరావుపేట పట్టనానికి చెందిన ఒకరు ఫిర్యాదు చేయగా గుంటూరులోని వికలాంగుల కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.లక్షన్నర తీసుకున్న వ్యక్తి ఉద్యోగం ఇప్పించకుండా వేధిస్తున్నాడని గురజాలకు చెందిన ఒకరు ఫిర్యాదు చేశారు. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, ఒకసారి అబార్షన్ కూడా చేయించారని భర్త, అత్తమామలపై పిడుగురాళ్లకు చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అర్జిదార్లకు నరసరావుపేటకు చెందిన బచ్చు వెంకట సత్యనారాయణ, రమాదేవి దంపతులు భోజన ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్.రాఘ వేంద్ర, ఎఆర్ అదనపు ఎస్పీ డి.రామచంద్ర రాజు, క్రైమ్ అదనపు ఎస్పీ ఎస్.కె చంద్రశేఖర్, డీఎస్పీలు కెవి మహేష్, పపి.రాజు, బి.ఆదినారాయణ, యు.రవి చంద్ర, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
తెలికయ వచ్చిన అర్జిదార్లు..
ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన 'జగనన్నకు చెబుదాం' స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలియని కొందరు ఫిర్యాదులతో కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే వేరే కార్యక్రమంలో ఉన్న జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రజలు వచ్చారని తెలుసుకుని కలెక్టరేట్‌కు వచ్చి 30 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.










