ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్ మోసం, అనధికార చీటీలు, ప్రేమపేరుతో మోసం,ఇతర సమస్యలపై ఫిర్యాదు దారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపవలెనని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆరు ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో దిశా డిఎస్పీ ఎస్‌ఆర్ హర్షిత, ఎస్బి సిఐ సిఎచ్. లక్ష్మణ, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటిడిఎ స్పందనకు 24 వినతులు
సీతంపేట : స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సంద్పన కార్యక్రమానికి 24 వినతులు వచ్చాయి. వీటిలో పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, డిడి శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ ఎస్.సింహాచలం, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, డిప్యూటీ డిఇఒ ఎ.లిల్లీరాణి, సిడిపిఒ రంగ లక్ష్మి, పిఎఒ హరికృష్ణ, పిహెచ్‌ఒ గణేష్ స్పోర్ట్స్ ఇంచార్జ్ జాకబ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.










