రాజంపేట అర్బన్ : అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రెండు వారాల కిందట ఆర్‌డిఒ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని ఇంతరకు అధికా రుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ పేర్కొ న్నారు. రాజంపేట పట్టణంలో బ్రాండ్స్ పేరుతో అధిక పీజులు వసూలు చేస్తున్న శ్రీ సాయి విద్యాలయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం గాంధీ బొమ్మ దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలను ఎటువంటి అనుమతులు లేకపోయినా శ్రీ సాయి విద్యాలయ స్కూల్ బోర్డు పెట్టి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బ్రాండ్స్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చుకుని నడుపుతున్నారని చెప్పారు. సిబిఎస్‌ఇ సిలబస్ పేరుతో స్మార్ట్‌టెక్నో, ఒలం పియాడ్, ఐపిల్, సి. బ్యాచ్ అనే పేర్లతో విద్యార్థులను విడదీసి విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూన్నారన్నారు. పుస్తకాలు, యూ నిఫామ్, బ్యాగులు వంటివి పాఠశాలల్లోనే విక్రయిస్తూ మార్కెట్ ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అటువంటి శ్రీ సాయి విద్యాలయ పాఠశాలతో పాటు కార్పొరేట్, ప్రయివేట్ పాఠశాలల పై విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు కాసులకు కక్కుర్తి పడి 2023-24 విద్యాసంవత్సరంలో ఒక్క పాఠశాల కూడా తనిఖీలు చేయకుండా చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటవ తరగతి నుంచి దాదాపుగా రూ. 30 వేలు, 7 నుండి 10వరకు రూ.50 వేలు పైన తల్లితండ్రుల దగ్గర నుండి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని వాపోయారు. శ్రీ సాయి విద్యాలయ, నారాయణతో పాటు మిగిలిన పాఠశాలల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పట్టి పీలుస్తున్నారని అన్నారు. వెంటనే అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, పట్టణ నాయకులు అఖిల్ , సుభాన్, గౌరీ శంకర్, హరి, మనోజ్, శ్రీనివాసులు, విజరు పాల్గొన్నారు.










