Feb 20,2023 23:56

అర్జీ దారులతో మాట్లాడుతున్న ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : ఫిర్యాదు దారులు పట్ల పోలీసు సిబ్బంది సహదయ భావంతో వ్యవహరించాలని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు స్పందన కార్యక్రమంలో తమ సమస్యలను స్వయంగా ఎస్‌పికి వివరించి వినతి పత్రాలు అందజేశారు. ఫిర్యాదు దారుల సమస్యలను చట్టపరిధిలో పరిష్కారం చూపేలా సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ కార్యాలయాలకు వస్తుంటారన్నారు. వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించి సహదయ భావంతో వారి సమస్యలను విని పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలన్నారు. చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలు సానుకూలంగా వినాలన్నారు. స్పందన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి 34 మంది వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పందన సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. మాలకొండయ్య, పోలీసు సిబ్బంది , అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.