ఫిర్యాదు చేస్తే బిఎల్‌ఒలపై చర్యలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఫిర్యాదు చేసిన బిఎల్‌ఒలపై చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి సువర్ణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మొదటి విడత ఓటర్ల సర్వేప్రక్రియపై 8 మండలాల తహశీల్దార్, సూపర్వైజర్లు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో రిటర్నింగ్ అధికారిణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఎవరైనా ఫిర్యాదు చేస్తే అట్టి వారిపై చర్యలు తప్పవని ఎవరైనా తప్పిదాలు చేసి ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు జాబితా అంతా ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా నియోజకవర్గం వారీగా కూడా ఓటర్లు మార్పులు చేర్పులను చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. మండలంలో ప్రస్తుతం ఉన్న 36 పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. 17 రెవెన్యూ గ్రామాలతో పాటు 12 సచివాలయాల్లోకి ప్రవేశించే ఓటర్లకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త వహించాలన్నారు. మండల అధికారులతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలన్నారు మండలంలో మొదటి విడత సర్వే సరిగా చేయలేదని బిఎల్‌ఒలు ఇంటింటికి తిరగలేదని ఆమె దృష్టికి రాజకీయ పార్టీ నాయకులు తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్ జగదీష్ బాబు, 8 మండలాల తహశీల్దార్లు, ఎన్నికల డిటిలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.










