
ప్రజాశక్తి-కంభం రూరల్ : ఈనెల 3న పాఠశాలల్లో స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహించనున్నారు. అందులో భాగంగా స్థానిక వాసవీ డిగ్రీ కళాశాలలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బ్లాక్ కోఆర్డినేటర్ ఎం. శామ్యూల్ సర్వే నిర్వహణ,విధి విధానాల గురించి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు వివరించారు. ఈ సర్వే ద్వారా జాతీయ స్థాయిలో 3,6 మరియు 9వ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేస్తారని తెలిపారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సర్వేను సమర్థవంతంగా నిర్వహిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ బి.మాల్యాద్రి, ప్రిన్సిపల్ రాము, సిఆర్‌పిలు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : ఈ నెల 3న స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహిస్తున్న ఇన్వెస్టిగేటర్స్‌కు దోర్నాలలోని బిఎం డిగ్రీ కళాశాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణపై ఇన్వెస్టిగేటర్స్‌కు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు మస్తాన్ నాయక్, కొండలరావు, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.