Sep 11,2023 20:50

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.26 వేలు చెల్లించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఉపాధి హామీ పథకంలో గత 17 సంవత్సరాల నుండి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కనీసన వేతనం కింద రూ.26వేలు ఇవ్వాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు మండల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యూనియన్‌ శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయంలో డిటి రాజేష్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఈ పథకం ముందంజలో ఉండడానికి కూలీలకు పనులు కల్పించడంలో పని దినాలు ఎక్కువ కల్పించడంలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉండడానికి ప్రగతి సాధించడానికి కృషి చేశామన్నారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేస్తున్న కృషి వల్లే గుర్తింపు వచ్చిందని తెలిపారు. అలాంటి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు చేస్తున్న కృషిని గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ మండల అధ్యక్షులు ధనుంజయ, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు బాబు, అన్ని గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.