
ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో చెరువులు, చెక్ డ్యామ్‌లు మొబైల్ యాప్ ద్వారా గుర్తించడంపై మంగళవారం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇన్‌ఛార్జి ఎఎస్‌ఒ విజరుకుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆదేశాల మేరకు మండలంలో వ్యవసాయ చెరువులు, చెక్ డ్యామ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో మొబైల్ యాప్ ద్వారా గుర్తించి ఆన్‌లైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపెందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆ విధంగా ప్రజలకు చెరువులు, చెక్ డ్యాముల ద్వారా ఉపాధి, వాటి ప్రాముఖ్యత, ఒక చెరువు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అవసరం అవుతుందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ సెక్టార్‌లో ఉన్న చెరువులు, చెక్ డ్యాములును గుర్తించాలన్నారు. వీటి కింద ఊట చెరువులు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎపిఒ సునీల్‌కుమార్, గ్రామ రెవెన్యూ అధికారులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.