Oct 22,2022 23:59

ఆందోళన చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:ఆంధ్ర యూనివర్సిటీ అనుబం ధంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ ఫీజులను తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే.ప్రభుదాస్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఫీజుల పెంపుపై నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్‌ ఫీజులు పెరిగిపోయాయని తెలిపారు. గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు విద్యను దూరం చేసే పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజుల పెంపు దేనికని ప్రశ్నించారు. విద్యను వ్యాపారంగా చేస్తున్నారని, ఫీజులు పెంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కార్పొరేట్‌ డిగ్రీ కళాశాల మాదిరిగా మారుస్తున్నారని విమర్శించారు.గిరిజన విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందుబాటులో లేదని, కేవలం డిగ్రీ, బిఈడి చదువులకే పరిమితం అవుతున్నారని, ఉన్నత చదువుల్ని అభ్యసించలేక పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నారావు, సింహాద్రి, రావణ్‌, మణి పాల్గొన్నారు..