Nov 15,2022 23:10

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుండి 11వ తేదీ వరకు నిర్వహించే గుణదల మేరి మాత ఉత్సవాలకు పటిష్టమై ఏర్పాట్లు చేస్తున్నట్లు గుణదల మేరిమాత పుణ్యక్షేత్రం రెక్టార్‌ ఫాదర్‌ విలియం జయరాజు అన్నారు. గుణదల మేరి మాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం మంగళవారం గుణదల పుణ్యక్షేత్రం నందు జరిగింది. ఈసందర్భంగా ఫాదర్‌ జయరాజు మాట్లాడుతూ దక్షిణభారతదేశ:లోనే ప్రసిద్ద క్షేత్రమైన మేరిమాత ఆలయ మహౌత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదన్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న ఉత్సవాలకు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుండి సుమారు 10 లక్షల మంత్రి యాత్రికులు హాజరుకానున్నారని వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. పోలీసు, రెవిన్యూ, ఆర్‌టిసి, విద్యుత్‌, వైద్య, రైల్వే, నగరపాలక సంస్థ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఈకార్యక్రమంలో బిషప్‌ సెక్రటరీ ఫాదర్‌ ఆనంద్‌ , ఎడ్యుకేషన్‌ డస్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ కొలకాని మరియన్న, ఫాదర్‌ మెరుగు మాల చిన్నప్ప, ఫాదర్‌ దామాల విజయకుమార్‌, ఫాదర్‌ జాన్‌రాజు, ఫాదర్‌ గుజ్జల మైఖేల్‌, సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ తోట సునీల్‌ రాజు, కమిటీ సభ్యులు తోట మోజెస్‌, తదితర గురువులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.