
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
పట్టణానికి చెందిన ఎస్‌ఆర్‌ఆర్ బార్సు హైస్కూల్ విద్యార్థి వాకా రాహుల్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ అండర్-23 పోటీలలో సిల్వర్ మెడల్ గెలుచుకోవటం పట్ల పలు విద్యాసంస్థలకు చెందిన అధినేతలు, పలువురు ప్రముఖులు సోమవారం విద్యార్థిని అభినందించారు. కాకినాడలో ఈనెల 14, 15వ తేదీలలో నిర్వహించిన ఫెన్సింగ్ మెన్ అండ్ ఉమెన్ అండర్-23 పోటీలలో రాహుల్ ఈ మెడల్ గెలుపొందారు. రాహుల్ జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాలని ప్రముఖులు అభినందించారు.