Aug 10,2023 22:03

పోటీలను ప్రారంభిస్తున్న రాజా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో ఫెన్సింగ్‌ క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని నగరానికి చెందిన వ్యాపారవేత్త బలభద్రుని రాజా సూచించారు. జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన నగరంలోని టౌన్‌ హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి ఎంపికలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెన్సింగ్‌ క్రీడను జిల్లాలో అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు. శిక్షణలను సద్వినియోగం చేసుకుని ఫెన్సింగ్‌ పోటీల్లో క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను, వైశ్యరాజు మోహన్‌, గిడుతూరి వెంకటేశ్వరరావు, సుధీర్‌ వర్మ, గురుగుబెల్లి ప్రసాద్‌, సంపతిరావు నాయుడు, పీడీ డి.భవాని, ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జోగిపాటి వంశి, గౌతమ్‌, నవీన్‌, మదన్‌ పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు
ఈ నెల 12 నుంచి 13 వరకూ భీమవరంలోని ఎస్‌ఆర్‌ కెఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ వేదికగా జరుగనున్న అండర్‌-20 ఫెన్సింగ్‌ రాష్ట్రస్థాయి జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేశారు. బాలురు ఫాయిల్‌ విభాగంలో సంపతరావు గౌతమ్‌ చంద్ర, డి.ప్రణరు, జి.చంద్రశేఖర్‌, పి.సునీల్‌, ఇప్పి విభాగంలో ఎస్‌.మురళీకృష్ణ, ఎస్‌.రోహిత్‌రాజు, కె.జయప్రకాష్‌, వై.దిలీప్‌కుమార్‌లు ఎంపికయ్యారు. బాలికల ఫాయిల్‌ విభాగంలో కె.ఎస్‌.భవాని, వి.బేబీషామిలి, ఎం.శ్రీమనస్వీ, ఇప్పీ విభాగంలో ఎం.బ్లెస్సీ రేచల్‌, ఎస్‌.అర్చన, ఎస్‌.యమునలు ఎంపికయ్యారు. ఈ ఎంపిలకు న్యాయనిర్ణేతగా ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జోగిపాటి వంవీ వ్యవహరించారు.