Apr 25,2023 17:51

ఉపాధి హామీ పనుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కూలీలు

ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలి : వ్యకాస
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

     ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్‌ యాప్‌ను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని ఎ.కోడూరు గ్రామంలో ఉపాధి పనులను వారు పరిశీలించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫొటో యాప్‌ ద్వారా ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సిగల్‌ ప్రాబ్లం ద్వారా కూలీలు వేతనాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఉపాధి కూలీలకు వేసవికాలంలో ఇచ్చే అలవెన్స్లను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రవాణా చార్జీలు, మెడికల్‌ కిట్టు, టెంటు, మజ్జిగ పనిచేసే చోట ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యాయని అన్నారు. మే 15న జరిగే నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా నాయకులు బంగారం, సిఐటియు నాయకులు రత్నమయ్య, ఉపాధి కూలీలు, మేటీలు పాల్గొన్నారు.