Jan 10,2023 22:45

ప్రజాశక్తి - గణపవరం
         అంగన్వాడీలకు ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎమ్‌డి.హసీనాబేగం, నేత కె.ఝాన్సీలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు ఎం.పెంటారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హసీనాబేగం, ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ ఎం.సన్యాసిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.రామకోటి, జయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
భీమడోలు: సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తహశీల్దార్‌ షంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానుద్దేశించి సిఐటియు నేత జి.స్వర్ణకుమారి, అంగన్వాడీల నేతలు బి.రాజమణి, పార్వతి మాట్లాడారు.
కుక్కునూరు: అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌ఐకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వై.సాయికిరణ్‌ మాట్లాడగా మండల అధ్యక్షులు కుంజా నాగలక్ష్మి, అంగన్వాడీలు రాయి రమణ, బాడిస సుజాత, విజయ, సౌజన్య, రాజేశ్వరి, వరలక్ష్మి, రాధ, సంధ్యారాణి, జయసుధ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పోడియం రాజు, నేతలు కృపామణి, తెల్లం రామలక్ష్మి, కె.పుష్ప, నూర్జహాన్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు నాగలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రాజెక్ట్‌ కార్యదర్శి కె.తులసి, సుకేషిని, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు: క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలను వేధించడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.వెంకట్రావు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం తహశీల్దార్‌ అల్లాడి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావుతోపాటు మండల సహాయ కార్యదర్శి వై.సుజాత మాట్లాడారు. ఈ సందర్భంగా జిఒ నెం.1 ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో సిహెచ్‌.రత్నకుమారి, కె.కనకమహాలక్ష్మి, ఎం.కరుణామ్మ, కె.భారతి, ఎ.లక్ష్మి, ఎం.ఝాన్సీ, జి.కుమారి, ఒ.అచ్యుత, కెవి.సుబ్బలక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.
చాట్రాయి: అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కొలికి పోగు భాస్కరరావు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌ సిహెచ్‌.విశ్వనాథరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు జ్యోతిరాణి, సుమలత, శ్రీదేవి, విజయ పాల్గొన్నారు.
జీలుగుమిల్లి: అంగన్వాడీలకు ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ అటెండెన్స్‌ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌.కొండలరావు మాట్లాడారు.
చింతలపూడి: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.25 వేలు ఇవాఇవలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ కోరారు. సిఐటియు మందల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు సరోజిని, మాణిక్యం, అరుణ, కవిత, శ్యామల, వర్థిని పాల్గొని మాట్లాడారు.
ఏలూరు: అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ నేతలు ఎ.రజిని, కనకదుర్గ, అంతోనమ్మ, సుకన్య, విజయ, రోజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
కలిదిండి: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ టి.తేజోమణికి అందచేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు ఎస్‌కె.అబిదా బేగం, నాయకులు జె.మేనక లక్ష్మి, కె.రమాదేవి, జె.పెద్దింట్లమ్మ, పి.పుష్ప, ఎమ్‌డి.పర్వీన్‌ సుల్తానా, విజయకుమారి, స్నేహ, రామలక్ష్మి, షాజాది, నజీర, ఎ.కుమారి పాల్గొన్నారు.
కైకలూరు రూరల్‌: తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూరెళ్ల లాజరు, అంగన్వాడీ నాయకులు పి.సుజాత, జి.జ్యోతిరాణి, బిడి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ముసునూరు: అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ దాసరి సుధకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నేతలు పల్లిపాము రాజకుమారి మాట్లాడగా కె.శ్రీనివాసరావు, పిల్లి మురళీ, అంగన్వాడీలు డి.శ్యామల, కె.లక్ష్మి, ఆర్‌.విజయకుమారి, వి.రమాదేవి, కె.నాగమణి, కె.మేరి సులోచన, టి.బుజ్జి, బి.నారియమ్మ, పి.జయమ్మ, విఎల్‌.వాసంతి, సుకన్య, కె.రాణి, ఎంకె.దుర్గ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: అంగన్వాడీలపై వేధింపులు అరికట్టాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పసల సూర్యరావు, షేక్‌ సుభాషిణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జి.విమల అధ్యక్షతన అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు, సుభాషిణి మాట్లాడారు. డిటి వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. హెచ్చరించారు. ఆనంతరం జిఒ నెం.1 ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నేతలు లక్ష్మీదేవి, సత్యవేణి, శిరోమణి, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.