
ప్రజశక్తి - చీరాల
ఫైరింగ్‌లో జాతీయస్థాయిలో 3వ స్థానం గెలుచుకున్న సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్ధి పగడాల ఈశ్వర్ రంగరాజ్‌ను స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. అఖిలభారత సైనిక్ దళ్ జూనియర్ డివిజన్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ తరఫున నిర్వహించిన ఫైరింగ్‌కు స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న పగడాల ఈశ్వర్ రంగరాజ్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 28న ఢిల్లీలో నిర్వహించిన ఫైరింగ్‌లో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచారు. ఢిల్లీలో మేజర్ జనరల్ పిఎస్ స్నేహ రావత్ సేన చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు.