Sep 22,2023 21:43

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు

ఫైనల్‌ పరీక్షలకు సంసిద్ధమవ్వాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : వయోజన విద్యలో భాగంగా అక్షరచైతన్య -2 ఫైనల్‌ పరీక్షలకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఉదయగిరి ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 24వ తేదీ ఆదివారం మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి 334 మంది ఫైనల్‌ పరీక్షలు రాసినందుకు ఏర్పాటు చేశామన్నారు.
సచివాలయ ఉద్యోగులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందితోపాటు హెచ్‌ఎంలపై ఉందన్నారు.