Jun 21,2023 00:55
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఉప్పాల అమర్నాథ్‌ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉప్పాలవారిపాలెం గ్రామంలో అమర్నాథ్‌ కుటుంబ సభ్యులను ఆమె కలిసి పరామర్శించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని జస్టిస్‌ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు నిందితులను 45 రోజులలో విచారణ చేయించి కఠినంగా శిక్ష విధించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు శ్రీనివాస్‌ కుమారి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పీ మనోజ్‌ కుమార్‌, సిఐటియు చెరుకుపల్లి మండల కార్యదర్శి కే శరత్‌ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఐద్వా ఆధ్వర్యంలో గుల్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పలు పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు నేటి సమాజంలో విద్యార్థులకు ఎదురవుతున్న అనుభవాలు, నేటి సమాజంలో ఎదురవుతున్న విష సంస్కృతి, యువతపై వాటి ప్రభావం, సెల్‌ ఫోన్ల వాడకం, యువతపై తల్లిదండ్రుల ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.